ఘట్కేసర్,అర్జున్ సమాచారం:
ఎంపి ఈటల రాజేందర్ రెండవ రోజు బుధవరం పాతయాత్ర కొనసాగింది. ఘట్కేసర్ మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించిన ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం లభించింది. మా మార్గదర్శకులు ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి తమకు మద్దతుగా వచ్చారని ఈటల రాజేందర్ తెలిపారు.
పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం జవహర్ నగర్ డంప్ యార్డు కు వ్యతిరేకంగా ఇరవై ఐదేళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశాం. జస్టిస్ స్వతంత్ర కుమార్ జవహర్ నగర్ డంప్ యార్డు ఎత్తివేయాలని ఆర్డర్ ఇచ్చారు. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈటల రాజేందర్ మనకోసం పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతు తెలుపడం మనందరి బాధ్యత. మనం పీల్చే గాలి స్వచ్చంగా ఉండాలి అది మన హక్కు. ఇక్కడ గాలి విషం అయ్యింది. గాలి పేల్చేది బ్రతకడానికి చావడానికి కాదు. గార్బేజ్ నుండి వచ్చే లీచెట్ వల్ల తాగే నీళ్ళు కలుషితం అయ్యాయి. తాగితే జబ్బులు వస్తున్నాయి.. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. బ్రతకడం మన హక్కు. ఆ హక్కు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్ కోర్టు తీర్పులను పక్కదోవ పట్టించడం వల్ల ఈ సమస్య తీరడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దు. పురుషోత్తం రెడ్డి చెప్పినట్లు స్వచ్ఛమైన గాలి నీరు ప్రజల హక్కు. కోర్టులు తీర్పులు ఇచ్చాయి, మేధావులు పరిష్కారం మార్గాలు చెబుతున్నారు.. అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి. ఇక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల వందలమంది చనిపోయారు.. వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని. డబ్బులు లేక కాంట్రాక్టర్ పనిచేయడం లేదు.. అంత దరిద్రంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఈ పాదయాత్రలో ఘాట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నేతలు, మెకానిక్ సంఘం, పరిశుద్య కార్మికులు, వివిధ కాలేజీల విద్యార్థులు, పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు.